- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫస్ట్ ఇండియన్స్‌కు టీకా వేయండి
న్యూఢిల్లీ: కరోనా కేసులు, మరణాలు, ఇతర అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, రోజువారీగా సమాచారాన్ని తొక్కిపెట్టకుండా వాస్తవ సంఖ్యలను వెల్లడించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోనే రాష్ట్రాల్లో టీకా డోసుల కొరత ఏర్పడిందని విమర్శించారు. ముందుగా భారత పౌరులకు టీకా వేయాలని, విదేశాలకు తర్వాత బహుమతులు పంపవచ్చునని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోనియా గాంధీ శనివారం వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘కరోనా విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రచారాలకు, ఆడంబ ప్రకటనలకు పరిమితం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవడానికి ఒత్తిడి తేవడం ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత. సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ రాష్ట్రాలతో కేంద్రం సహకరించాలని, అలాగే, కరోనాపై పోరులో రాష్ట్రాలూ అంతే బాధ్యతతో మెలగాలి. కరోనా పరిస్థితులు చేజారకుండా చర్యలు తీసుకోవాలి. టెస్ట్, ట్రాక్, వ్యాక్సినేట్ సూత్రాన్ని వేగంగా పాటించాలి. ఎన్నికల ర్యాలీలు కరోనా ప్రబలడానికి ఒక కారణమైంది. ఇందులో మన బాధ్యత కూడా కొద్ది మేరకు ఉన్నది. ఈ నిజాన్ని అంగీకరించి దేశ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడాల్సి ఉన్నది’ అని సూచించారు.