ఆ రాష్ట్రంలో రెండు వారాలు సంపూర్ణ లాక్‌డౌన్

by Shamantha N |   ( Updated:2021-05-02 00:47:36.0  )
ఆ రాష్ట్రంలో రెండు వారాలు సంపూర్ణ లాక్‌డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషాలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరడంతో జనాలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒడిషా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిషాలో మే 5 నుండి 19 వరకు రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ విధించనున్నట్టు ప్రకటన విడుదల చేసింది. అయితే.. వైద్య, అత్యవసర సేవల విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది. లాక్‌డౌన్ ఆంక్షలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story