'ఉపసంహరించుకోవాలి.. విరమించుకోవాలి'

by Shyam |
ఉపసంహరించుకోవాలి.. విరమించుకోవాలి
X

దిశ, నల్లగొండ : కార్మికుల చట్టాల రద్దును ఉపసంహరించుకొవాలని, పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచే ఆలోచనను విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తుర్కపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫెర్ బోర్డు ద్వారా నెలకు రూ. 5వేలు ఇవ్వాలన్నారు. దేశ రక్షణ రంగంలో 74 విదేశీ పెట్టుబడులకు మోదీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ దేశ ఆత్మగౌరవాన్ని కార్పోరేట్ ల ముందు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కార్మికచట్టాలను సవరిస్తూ కొన్నింటిని రద్దు చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు నెలకు రూ.7500 ఇవ్వాలని, మూడు నెలలు ఉచితంగా సరుకులు పంపిణి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పొతరాజు జహంగీర్, కొక్కొండ లింగయ్య, గడ్డమిది నర్సింహ్మ, తూటి వెంకటేశం, మల్లయ్య, జి.బలరాం, సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story