కేంద్రంపై గెలిచిన రైతులకు విప్లవ జేజేలు.. మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన

by Shyam |   ( Updated:2021-11-22 06:13:30.0  )
Maoist party
X

దిశ, నూగురు వెంకటాపురం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేసేవరకూ పోరాడి విజయం సాధించిన రైతులను భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) అభినందించింది. కరోనా పాండమిక్‌లో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతులను కేంద్ర ప్రభుత్వం పొట్టనపెట్టుకున్నదని, వారి కుటుంబాలకు మావోయిస్టు పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రైతులు చేసిన ఈ పోరాటం దేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.

ఉద్యమం చేస్తున్న రైతులను ఎన్ని రకాలుగా హించించినా, చిత్ర హింసలకు గురిచేసినా, లాఠీ చార్జీలు చేసి రక్తం కళ్లజూసినా ప్రాణాలకు తెగించి పోరాడిన రైతుల సుదీర్ఘ ఉద్యమాన్ని మావోయిస్టు పార్టీ ప్రశంసించింది. కేంద్రం మరోసారి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురాకుండా ఉండాలని, ఇదే క్రమంలో రైతులపై పెట్టిన అక్రమ కేసులను కూడా వెంటనే ఎత్తి వేయాలని మావోయిస్టు పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల అప్రమత్తంగా ఉంటూ తమ పోరాటాన్ని కొనసాగించాలని రైతాంగాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

Maoist party statement

Advertisement

Next Story

Most Viewed