‘అతడి టార్గెట్ ఆప్ ఎమ్మెల్యే కాదు’

by Shamantha N |
‘అతడి టార్గెట్ ఆప్ ఎమ్మెల్యే కాదు’
X

ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాన్వాయ్‌పై కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపలేదని తెలిపారు. దుండగుడు పక్కా ప్రణాలిక ప్రకారమే కార్యకర్త అశోక్ మన్‌పై కాల్పులు జరిపినట్టు సౌత్‌వెస్ట్ అడిషనల్ డీసీపీ ఇంగిత్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు. దీనిపై మరింత విచారణ చేపట్టనున్నట్టు చెప్పారు. నరేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ఈ కాల్పులు ఎవరిని లక్ష్యంగా చేసుకుని జరిపారో తనకు తెలియదన్నారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ చేపట్టి త్వరలోనే ఈ కేసును ఛేదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, నరేశ్ కాన్వాయ్‌పై దుండగుడు జరిపిన కాల్పుల్లో కార్యకర్త అశోక్ మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story