- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చైతూకు కాల్ చేసిన అమీర్ ఖాన్.. ఎందుకో తెలుసా!

దిశ, సినిమా : మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు అక్కినేని నాగచైతన్య. ముందుగా విజయ్ సేతుపతిని అనుకున్నా కొన్ని కారణాల వల్ల తను తప్పుకోవడంతో చైతూ ఈ క్యారెక్టర్‌కు సెలక్ట్ అయ్యాడు. ఈ మూవీ చాన్స్‌పై మాట్లాడిన అక్కినేని వారసుడు.. తనకు సంబంధించిన మూవీస్, ట్రైలర్స్ చూసిన అమీర్ పర్సనల్ కాల్ చేశాడని తెలిపాడు. మూవీకి సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడారని.. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్ డిస్కషన్స్ కోసం ముంబై వెళ్లానని, వెంటనే ఓకే అయిందని చెప్పాడు.
ఇదంతా ఒక మ్యాజిక్‌లా జరిగిపోయిందన్న చైతన్య.. సెట్స్‌లో అమీర్ ఎగ్జైట్‌మెంట్, ఎనర్జీ లెవల్స్ అమేజింగ్ అని తెలిపాడు. అంతేకాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న డెవలప్‌మెంట్స్ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటాడని చెప్పాడు. మ్యూజిక్ లవర్ అయిన అమీర్.. ప్రజెంట్ ఫిల్మ్ సాంగ్స్ కాకుండా ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ పాటలు ప్లే చేయాలని అడుగుతాడని చైతూ తెలిపాడు.