- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమీర్ ఖాన్‌లా ఆలోచిస్తే.. నిర్మాతలకు కష్టాలుండవు!
దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ను మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అని చెప్పుకోవడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తోంది. ప్రతీ విషయంలోనూ పర్‌ఫెక్షన్ మెయింటైన్ చేసే తను.. నిర్మాతల విషయంలో మరింత సహృదయంతో ఉంటారని తెలుస్తోంది. సాధారణంగా సినిమాకు ముందే నటులు రెమ్యునరేషన్ తీసుకుంటారు కానీ తను మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోనని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.
మూవీ హిట్ అయ్యి, పెట్టుబడి తిరిగొచ్చి లాభాలు వచ్చినప్పుడు మాత్రమే రెమ్యునరేషన్ గురించి ఆలోచిస్తానని తెలిపాడు. ఈ క్రమంలో లాభాల్లో కొంత శాతం తీసుకుంటాను తప్ప ప్రాఫిట్ లేని సినిమాకు ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయనని వెల్లడించారు. తన వల్ల ఎవరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆ విషయంలో బాధ్యతాయుతంగా ఉంటానని పేర్కొన్నాడు. సినిమా నష్టాన్ని చవిచూస్తే తనకు డబ్బులు రావని, నిర్మాతకు ఖర్చులు రికవర్ అయిన తర్వాత వచ్చే మొదటి రూపాయే ఆ సినిమాకు తన మొదటి సంపాదన అవుతుందని అమీర్ ఖాన్ స్పష్టం చేశాడు.