పుష్పలో ఆది కీ రోల్?

by Shyam |
పుష్పలో ఆది కీ రోల్?
X

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌లో మరో యాంగిల్ చూపించిన సినిమాలో.. ఆది పినిశెట్టి పాత్ర అద్భుతమనే చెప్పాలి. చిట్టి బాబుగా చెర్రీకి ఈ సినిమా ద్వారా ఎంత పేరు వచ్చిందో.. అశోక్ బాబుగా అంతే పేరు ఆదీకి వచ్చింది. అలాంటి యాక్టర్‌తో పని చేయాలి అంటే ఎవరికైనా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. అందుకే సుకుమార్ మరో చాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం పుష్ప. లారీ డ్రైవర్‌గా బన్నీ కనిపించనుండగా..గిరిజన యువతిగా నటిస్తుంది హీరోయిన్ రష్మిక మందన. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి కూడా కనిపిస్తాడని టాక్. అయితే కొత్తగా ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీ రోల్ ప్లే చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. రంగస్థలం మాదిరిగానే ఈ చిత్రంలో క్యారెక్టర్ కూడా ఆది కెరియర్‌లో బెస్ట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.

కరోనా మహమ్మారి కారణంగా పుష్ప సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లనే లేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

Advertisement

Next Story