ఆ యంగ్ బ్యూటీ చాలా స్పెషల్ అంటున్న హీరో..

by Jakkula Samataha |
ఆ యంగ్ బ్యూటీ చాలా స్పెషల్ అంటున్న హీరో..
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ తార సుతారియా, హ్యాండ్సమ్ బాయ్ ఆదార్ జైన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. లవ్ మ్యాటర్‌పై పబ్లిక్‌గా ఓపెన్ అయిపోయిన ఈ జంట.. తమ లవ్ ఎక్స్‌ప్రెస్ చేసేందుకు, సపోర్ట్ చేసుకునేందుకు ఏ మాత్రం వెనుకాడరు. ప్రస్తుతం ఆదార్ నటించిన ‘హలో చార్లీ’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రమోషన్స్‌తో బిజీగా గడిపేస్తున్నాడు. ఈ క్రమంలో తార గురించి ఓ మీడియా చానల్ ప్రశ్నించగా.. ‘తను నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి.

మేము ఒకరికొకరం ఆనందాన్ని పంచుకునేందుకు ప్రయత్నిస్తుంటాం. బయటకు వెళ్తూ ఎంజాయ్ చేస్తాం. ప్రజలు మాపై చాలా ప్రేమ చూపిస్తారు. తనతో సమయం గడపడం చాలా బాగుంటుంది. నేను చెప్పదలచుకుంది ఇంతే’ అంటూ సమాధానమిచ్చిన ఆదార్.. ‘హలో చార్లీ’ మూవీ చూసి చాలా ఎగ్జైట్ అయిందన్నాడు. సినిమా స్క్రిప్ట్, కాన్సెప్ట్ యూనిక్‌గా ఉందని.. ఇందులోని క్యారెక్టర్లు అన్నింటితోనూ లవ్‌లో పడిపోయానని తెలిపిందని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story