- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దుర్గామాత భక్తులకు షాక్.. నిమజ్జన ఊరేగింపులో అపశృతి
by Aamani |

X
దిశ,ముధోల్ : నిర్మల్ జిల్లా ముధోల్‌లో జరిగిన దుర్గా మాత నిమజ్జనంలో అపశృతి జరిగింది. ఊరేగింపులో నృత్యం చేస్తూ ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముధోల్ మండల కేంద్రంలోని ధోబిగల్లికి చెందిన తొట్ల సాయినాథ్ (30) శనివారం సాయంత్రం ప్రారంభమైన దుర్గామాత నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్నాడు. ఉత్సాహంగా వీధుల్లో నృత్యం చేస్తూ సంతోషంగా గడిపాడు. రాత్రి సమయంలో డ్యాన్స్ చేస్తూనే ఒక్కసారి కుప్పకూలాడు. వెంటనే పక్కన ఉన్న వాళ్లు గమనించి సాయినాథ్‌ను లేపే ప్రయత్నం చేయగా.. అప్పటికే మృతి చెందాడు. దీంతో ఆ ప్రాంతమంతా విషాదం అములుకుంది. కొన్ని క్షణాల ముందు వరకు తమతో నృత్యం చేసిన వ్యక్తి మృతి చెందడంతో అతడి స్నేహితులు కన్నీటిపర్యంతం అయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Next Story