దేవరకద్రలో మహిళ మృతదేహం లభ్యం

by Sumithra |   ( Updated:2020-04-18 03:32:09.0  )
దేవరకద్రలో మహిళ మృతదేహం లభ్యం
X

దిశ, మహబూబ్‌నగర్: జిల్లాలోని దేవరకద్ర మండలం పేరూరు గ్రామంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. గ్రామంలోని చెరువు కట్ట ప్రాంతంలో శ్మశాన వాటిక నిర్మాణ పనుల కోసం మట్టి తవ్వుతుండగా దుప్పట్లో చుట్టి పూడ్చిపెట్టిన మహిళ మృతదేహం బయటపడింది. దీంతో అక్కడ పనిచేస్తున్న గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో అనుమానిత శవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మిస్టరీలు వీడక ముందే మరో మృతదేహం లభ్యం కావడంతో గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరుస మిస్టరీలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారించి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Tags: woman dead body, photos, murder, mahabubnagar, Village



Next Story

Most Viewed