ఒడిషాపై జంషెడ్‌పూర్ విజయం

by Shyam |
ఒడిషాపై జంషెడ్‌పూర్ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి జీఎంసీ స్టేడియంలో ఒడిషా ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ 1-0 తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఒడిషా క్లబ్ ఎడమ నుంచి కుడికి కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. ఒడిషా క్లబ్ డిఫెన్స్ ఆటగాళ్లు మంచి అనుభవం ఉన్న వాళ్లే అయినా ఈ సీజన్‌లో అంతగా రాణించడం లేదు. దీంతో వరుస ఓటములు కారణంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నది. ఆదే పేలవ ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ రిపీట్ చేశారు. 40వ నిమిషంలో ఒడిషా డిఫెన్స్‌ను చాకచక్యంగా ఛేదించి మొహమ్మద్ మోబషిర్ గోల్ చేశాడు. దీంతో జంషెడ్‌పూర్ క్లబ్ 1-0 ఆధిక్యంలో దూసుకొని పోయింది. రెండో అర్దభాగంలో ఇరు జట్లు గోల్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. కానీ, ఒక్కరు కూడా గోల్ చేయలేకపోయారు. నిర్ణీత సమయం ముగిసే సరికి జంషెడ్‌పూర్ జట్టు 1-0 ఆధిక్యంతో మ్యాచ్ గెలిచింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి, ఆ తర్వాత రెండు డ్రా చేసుకున్న జంషెడ్‌పూర్‌కు ఈ విజయం కాస్త ఊరటను ఇచ్చింది. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రెండూ సెమిలెన్ డొగెల్‌కు దక్కింది.

Advertisement

Next Story