- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అతడిని నమ్మి.. ప్రాణాలు తీసుకుంది
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమ పేరిట కలిసి తిరిగిన వ్యక్తే నమ్మకం ముసుగులో చేసిన మోసం భరించలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ మేడిపల్లికి చెందిన యువతి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఆమెను అజయ్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నట్లు వెంటపడ్డాడు. అలా పరిచయం పెంచుకోని ఆమె వ్యక్తిగత ఫొటోలు సేకరించాడు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పెట్టి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. అతడి వేధింపులను భరించలేని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయినా తీరు మార్చుకోని అజయ్.. ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెంటపడుతూ తనను పెళ్లి చేసుకోవాలని, అలా అయితేనే సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలు తీస్తానని బ్లాక్ మెయిల్‌కు దిగాడు. ఒకవైపు అతడి వేధింపులు అధికం కావడం.. మరోవైపు సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోలతో తన పరువు పోవడంతో సోమవారం సాయంత్రం ఆమె రైలుకు ఎదురెల్లి ఆత్మహత్యకు పాల్పడింది.