అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘటన

by Shyam |   ( Updated:2020-12-22 11:12:14.0  )
అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘటన
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలించక, వర్ష ప్రభావం వల్ల క్రికెట్ మ్యాచ్ ఆపడం చూసాం. కానీ ఇక్కడ కాస్త వెరైటీగా సూర్యుడి వల్ల ఆట ఆగిపోయింది. సూర్య కిర‌ణాలు నేరుగా బ్యాట్స్‌మెన్ క‌ళ్ల‌లో ప‌డ‌డం వ‌ల్ల అంతర్జాతీయ మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు. న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో హారీస్‌ రౌఫ్‌ వేసిన నాలుగో బంతిని గ్లెన్‌ ఫిలిప్స్‌ సింగిల్‌ తీశాడు. సూర్య కిరణాలు నేరుగా బ్యాట్స్‌మెన్ కళ్లలో పడటం వల్ల బౌలర్‌ వేసిన బంతులను ఎదుర్కోలేకపోయాడు. ఈ విషయం అంపైర్లకు తెలిపాడు. దీంతో వెంటనే ఫీల్డ్‌ అంపైర్లు చర్చించుకొని కొద్దిసేపు ఆటను ఆపేశారు. అనంతరం యథావిధిగా మళ్లీ ఆటను కొనసాగించారు.

Advertisement

Next Story

Most Viewed