వ్యాక్సిన్ తీసుకుంటే.. డేటింగ్ యాప్స్‌లో ఆఫర్స్

by Shyam |
వ్యాక్సిన్ తీసుకుంటే.. డేటింగ్ యాప్స్‌లో ఆఫర్స్
X

దిశ, ఫీచర్స్ : ఇప్పుడు ఏ దేశంలో చూసినా వ్యాక్సినేషన్ గురించే చర్చ నడుస్తోంది. వ్యాక్సిన్‌తోనే కరోనాకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టే అవకాశాలుండగా ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో ప్రజలను టీకాలు వేసుకునేలా ప్రోత్సహించేందుకు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. కాగా ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ కూడా వ్యాక్సినేషన్‌కు ప్రయారిటీ ఇస్తుండటం విశేషం. ఈ విషయంలో డేటింగ్ యాప్స్‌తో టైఅప్‌ అయిన అమెరికా ప్రభుత్వ పాలనా విభాగం.. టీకా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను సదరు యాప్స్‌లో ప్రదర్శించేందుకు వారితో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించింది.

టీకా తీసుకున్న యూజర్లు తమ వ్యాక్సినేషన్ స్టేటస్‌ను తెలిపే బ్యాడ్జెస్‌‌ను ‘హింగే, టిండర్, మ్యాచ్, బంబుల్’ వంటి డేటింగ్ యాప్స్‌లో డిస్‌ప్లే చేసినట్టయితే.. స్పెషల్ ఇన్సెంటివ్స్‌ను అందించడంతో పాటు ప్రీమియం కంటెంట్‌కు ఫ్రీ యాక్సెస్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరింత అడ్వాన్స్‌గా ఆలోచించిన ‘బీఎల్‌కే, చిస్పా’ యాప్స్.. వ్యాక్సినేటెడ్ ప్రొఫైల్స్‌కు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే పార్టనర్స్‌ను వెతికిపెట్టేందుకు సాయపడుతున్నాయి. మరొక డేటింగ్ యాప్ ‘ఓకేక్యూపిడ్’ కూడా సరైన జోడీలను ఫిల్టర్ చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు కల్పిస్తోంది.

అంతేకాదు, దగ్గరలోని కొవిడ్ వ్యాక్సినేషన్ సైట్ వివరాలను ఎలా తెలుసుకోవాలనే సమాచారంతో పాటు వ్యాక్సిన్ సంబంధిత సందేహాలకు సమాధానాలు కూడా ఈ యాప్స్‌లో లభిస్తాయని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న లేదా ప్లానింగ్‌లో ఉన్నవారికి ‘ఓకేక్యూపిడ్’ యాప్‌లో 14% అధికంగా ఉత్తమ జంటలను పొందినట్టు అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అయితే ఈ డేటింగ్ యాప్స్‌లో తాము ఎంచుకునే పార్టనర్స్ ఎత్తు, వయసు వివరాలు తెలిసినట్టుగా వ్యాక్సినేషన్ స్టేటస్‌ను తెలుసుకునే చాన్స్ లేదని స్పష్టం చేసింది.

జూలై 4 నాటికి అమెరికాలో 70 శాతం మందికి కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ అయినా కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఉండగా.. ప్రస్తుతం 60.5 % పూర్తికావడం విశేషం. ఈ క్రమంలో ప్రజలను వ్యాక్సినేషన్ ప్రదేశానికి తీసుకెళ్లేందుకు ఊబర్, లిఫ్ట్ వంటి సంస్థలు ఫ్రీ రైడ్ ఆఫర్‌ను అందిస్తున్నాయి. మరికొన్ని కార్పొరేట్ సంస్థలు లక్కీ లాటరీ ప్రైజెస్ ఇస్తున్నాయి. కాగా ఈ ప్రయత్నాల వల్ల రోజుకు 5,51,000గా ఉన్న వ్యాక్సినేషన్ సంఖ్య.. ప్రస్తుతం 6,30,00కు పైగా నమోదవుతున్నట్టు సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ బోర్డ్ అండ్ ప్రివెన్షన్ లెక్కలు చెబుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed