మారు తండ్రిని చంపి.. అడవిలో పాతిపెట్టిన బాలిక

by Sumithra |
మారు తండ్రిని చంపి.. అడవిలో పాతిపెట్టిన బాలిక
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ జగద్గిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలిక.. మారు తండ్రిని చంపి అడవిలో పాతిపెట్టిన ఘటన వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. జగద్గిరిగుట్టలో సోనూ అనే మహిళతో వీరభద్రం సహజీవనం చేస్తున్నాడు. ఇదేక్రమంలో సోనూ కూతురుపై వీరభద్రం లైంగిక వేధింపులకు పాల్పడటంతో విసిగిపోయిన బాలిక.. ఫోన్‌ చేసి పిలిచి పక్కా వ్యూహం అమలు చేసింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి వీరభద్రంను చంపి వికారాబాద్ అడవుల్లో పాతిపెట్టింది. సెప్టెంబర్ 19న ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి వీరభద్రం కనిపించకుండా పోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు విచారణ చేపట్టి ఛేదించారు. బాలికకు సహకరించిన ఓ యువకుడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు.

Next Story