బోర్ కొడుతోందా? నెట్‌ఫ్లిక్స్‌లో ఇవి ట్రై చేయండి

by Shyam |
బోర్ కొడుతోందా? నెట్‌ఫ్లిక్స్‌లో ఇవి ట్రై చేయండి
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 లాక్‌డౌన్ వల్ల ప్రజలకు కావాల్సినంత సమయం దొరికింది. దీంతో ఏకబిగిన స్ట్రీమింగ్ సర్వీసుల్లో కార్యక్రమాలు, సినిమాలు చూసేస్తున్నారు. నెల రోజులకు పైగా దాటడంతో నెట్‌ఫ్లిక్స్ లాంటి సర్వీసుల్లో దాదాపు మంచి సిరీస్‌లన్నీ చూసి ఉంటారు. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో దాగివున్న మంచి సినిమాలు, షోస్ ఎలా వెతకాలో, ఇంకా ఆ యాప్‌లో ఉన్న ఇతర సౌకర్యాల గురించి చాలా మందికి తెలియదు. వాటిలో కొన్ని మీకోసం…

1. టాప్ 10 జాబితా

మీ దేశంలో ట్రెండింగ్‌లో ఉన్న సినిమాలు, కార్యక్రమాల జాబితాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. యూజర్ హోం పేజీలో ఇవి కనిపిస్తాయి. ఇంకా లోతుగా వెతకాలంటే సిరీస్ అండ్ ఫిల్మ్స్ ట్యాబ్‌లో విభిన్న కేటగిరీలు, జానర్లలో టాప్ 10లో ఉన్నవాటిని చూడొచ్చు. ఇందులో మంచి విషయం ఏంటంటే… ఈ జాబితాలు ప్రతిరోజు అప్‌డేట్ అవుతాయి.

2. మంచి కలెక్షన్ల కోసం సెర్చ్

ఏదన్నా సినిమా చూడాలనిపిస్తే దాని పేరుతో సెర్చ్ చేయడం అలవాటే. నెట్‌ఫ్లిక్స్‌లో ఆ సెర్చ్ ఆప్షన్ ద్వారా కేవలం సినిమా పేరు ద్వారా మాత్రమే కాదు ఇంకా చాలా రకాలుగా కావాల్సిన సినిమాను వెతకొచ్చు. ఉదాహరణకు లవ్ ట్రయాంగిల్, కే పాప్, ఫాంటసీ, టాకింగ్ యానిమల్స్, స్లో బర్న్, ఎపిక్ ప్రపంచాలు, ఫీల్ గుడ్ అని భావనలను తెలిపే పదాలతో కూడా సినిమాలు, షోలు సెర్చ్ చేసుకోవచ్చు.

3. ప్రొఫైల్ ఆధారంగా బ్యాండ్‌విడ్త్

ఒక్కో సినిమాను ఒక్కో బ్యాండ్‌విడ్త్‌లో చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే పిల్లల కార్యక్రమాలను తక్కువ బ్యాండ్‌విడ్త్‌లో చూస్తే డేటా మిగుల్చుకోవచ్చు. అయితే ప్రతి ప్రొఫైల్‌కి ప్రత్యేకంగా బ్యాండ్‌విడ్త్ సెట్ చేసుకోగల అవకాశం ఉంది. మీ ఖాతాలోని పేరెంటల్ కంట్రోల్స్‌లో ప్లేబ్యాక్ సెట్టింగులలో దీన్ని మార్చుకోవచ్చు. ఇందులో డేటా యూసేజ్ లిమిట్ కూడా పెట్టుకోవచ్చు.

4. ప్రొఫైల్ లాక్స్

ఒకే నెట్‌ఫ్లిక్స్ నలుగురు, ఐదుగురు కలిసి ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు ఒకరి ప్రొఫైల్ ఒకరు, ఒకరికి తెలియకుండా మరొకరు చూస్తారు. అలాంటి భయం లేకుండా ఎవరి ప్రొఫైల్‌కి వారు లాక్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ప్రొఫైల్స్ కంట్రోల్స్‌కి వెళ్లి ప్రొఫైల్ లాక్ మార్చుకోవచ్చు.

Tags: Netflix, Profile, Search, lock, favourite movies, shows

Advertisement

Next Story