- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనిపోయే వీడియో పంపు.. భార్యకు భర్త ఆర్డర్
దిశ వెబ్‌డెస్క్: ‘నువ్వు చనిపోయే వీడియో పంపు’ అని తన భార్యకు ఒక భర్త ఆర్డర్ వేశాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ దారుణం జరిగింది. అహ్మదాబాద్‌కి చెందిన 23 ఏళ్ల అయేషా భర్త వేధింపులు తట్టుకోలేక సబర్మతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక వీడియోను రికార్డు చేసింది. అలాగే తన భర్తతో 70 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడింది. పోలీసులు ఫోన్ రికార్డింగ్‌ను పరిశీలించగా.. ‘నువ్వు చనిపోయే వీడియో పంపు’ అంటూ భార్యకు భర్త చెప్పిన మాటలు వినిపించాయి.
అయేషాకు రాజస్థాన్‌కి చెందిన అలీఫ్ ఖాన్‌తో జులై 2018లో పెళ్లి అయింది. పెళ్లి అయిన దగ్గర నుంచి అదనపు కట్నం కోసం అయేషాను అలీఫ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. దీంతో అయేషా కుటుంబ సభ్యులు కొంత డబ్బులు ఇచ్చినా.. మళ్లీ అదనపు కట్నం కోసం వేధించారు. అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక గత కొద్ది నెలల క్రితం అయేషా తన పుట్టింటికి తిరిగి వచ్చేసింది
అయితే అదనపు కట్నం ఇవ్వాలని వేధిస్తున్నారంటూ గత ఏడాది అత్తింటివారిపై అయేషా కేసు పెట్టింది. అప్పటి నుంచి భార్యను అలీఫ్ ఖాన్ మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. కేసు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ చాలాసార్లు హెచ్చరించాడు. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక అయేషా ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యకు ముందు జరిగిన ఫోన్ కాల్‌లో అదనపు కట్నం కేసు గురించి అయేషాతో భర్త మాట్లాడినట్లు ఉంది. దీంతో అలీఫ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయేషా, అలీఫ్ ఖాన్ ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.