- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన మహిళకు అన్యాయం.. టీఆర్ఎస్ నాయకుడు అలా ఎందుకు చేస్తున్నాడు ?
దిశ,మణుగూరు : వివాహం అంటే నూరేళ్ళపంట, జీవితానికి మరపురాని జ్ఞాపకాలే వివాహం. భార్య, భర్తల మధ్య గొడవలు రావడం కామన్.. ఇలా గొడవలు వస్తేనే భార్య..భర్తలు అని తెలుస్తుంది నేటి సమాజానికి. భార్య,భర్తలు గొడవలు పడితే పెద్దలు మాట మాటా కలిపి ఇద్దరిని ఒకటి చేస్తారు. మంచిగా బతకండని దీవిస్తారు. అశ్వాపురం మండలంలో ఓ గిరిజన మహిళ ప్రభుత్వ ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగికి ఏమైందో తెలియదుగానీ గిరిజన మహిళ నాకు వద్దు అని మోర పెడుతున్నాడు.ఈవిషయం పెద్దవాళ్ల తెలిసింది, ససేమిరా అంటున్న ప్రభుత్వ ఉద్యోగిపై కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ వరకు వచ్చారు గిరిజన మహిళ తరుపువాళ్లు.. అయితే గిరిజన మహిళకు,ప్రభుత్వ ఉద్యోగికి నాలుగు మంచి మాటలు చెప్పి కలపాల్సింది పోయి అశ్వాపురం మండలం టీఆర్ఎస్ పార్టీ ఓనాయకుడు ప్రభుత్వ ఉద్యోగికి వత్తాసు పలకడం ఎంతవరకు సమజసం అని మండలంలో కొందరు ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు.
ఆనాయకుడి కులస్థుడని వత్తాసు పలుకుతున్నడా.. లేక సెటిల్మెంట్ చేస్తే నాలుగు రూపాయలు వస్తాయని చేస్తున్నాడా అనేది మండలంలో సంచలనం రేపుతోంది. ప్రభుత్వ ఉద్ద్యోగి గిరిజన మహిళ నాకు వద్దు అని చెబుతుంటే ఈ టీఆర్ఎస్ నాయకుడు గిరిజన మహిళకు సపోర్ట్ చేయకుండా, ప్రభుత్వ ఉద్యోగికి సపోర్ట్ చేయడంలో ఆంతర్యం ఏంటో ప్రశ్నార్థకంగా మారింది. మండలంలో ఈనాయకుడు సెటిల్మెంట్లు జోరుగా చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తుండని మండలంలో కొందరు ప్రముఖులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి డబ్బులు ఎక్కువ ఇస్తాడాని సపోర్ట్ చేస్తున్నాడని, అదే గిరిజన మహిళ రూపాయి కూడా ఇవ్వలేదని సపోర్ట్ చేయడంలేదని పలువురు మాట్లాడుకుంటున్నారు. ఈ నాయకుడు గిరిజన మహిళకు సపోర్ట్ చేస్తాడా.. లేక ప్రభుత్వ ఉద్యోగికి సపోర్ట్ చేస్తాడా అనేది శనివారం పెద్దల సమక్షంలో తెలుస్తుంది.
దిశ ఫౌండేషన్ సంస్థ మహిళలు వసూళ్లరాణీలుగా మారారా..!
మహిళలకు అన్యాయం జరుగుతే దగ్గరుండి ఆ మహిళలకు న్యాయం చేయాల్సిన దిశ ఫౌండేషన్ సంస్థకు చెందిన మహిళలు వసూళ్లరాణిలుగా మారారని మండలంలో ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.రోజు పోలీస్ స్టేషన్ కి ఏ కేసులు వస్తున్నాయో తెలుసుకొని,ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వారికే ఈమహిళలు సపోర్ట్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్యాయం జరిగిన మహిళకు మేము ఉన్నామని భరోసా ఇవ్వాల్సింది పోయి, వసూళ్లకు పాల్పడటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈగిరిజన మహిళకు అశ్వాపురం మండలంలో దిశ ఫౌండేషన్ సంస్థ చెందిన మహిళలు ఏం న్యాయం చేస్తారో వేచిచూడాల్సిందే.
అశ్వాపురం మండలంలో ఏమి జరుగుతోంది..
గిరిజన మహిళ నాకు నాభర్త కావాలని భిక్షించి కూర్చుంది. ప్రభుత్వ ఉద్యోగి తరఫున వచ్చిన వాళ్లు గిరిజన మహిళకు ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోవలని చూస్తున్నారని సమాచారం. విషయం ఏమిటంటే గిరిజన మహిళకు ఎవరు సపోర్ట్ చేయకపోవడం బాధాకరంగా మారింది.గిరిజన మహిళ తరఫున వాళ్ళు అశ్వాపురం పొలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేస్తే శనివారం ఉదయం రమ్మని పోలీస్ అధికారి చెప్పినట్లు మహిళ తరుపున వాళ్ళు తెలిపిన సమాచారం. మరి గిరిజన మహిళకు న్యాయం జరుగుతుందో లేదో శనివారం వరకు వేచి చూడాలి.