త్వరలో బీజేపీలోకి మాజీ మంత్రి !

by srinivas |
త్వరలో బీజేపీలోకి మాజీ మంత్రి !
X

దిశ, విశాఖపట్నం: వచ్చే రోజుల్లో ఉత్తరాంధ్ర నుంచి బీజేపీలోకి చేరికలు ఎక్కువగా ఉంటాయని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే విజయనగరం జిల్లా నుంచి ఓ మాజీ మంత్రి బీజేపీలో చేరనున్నారని, రాయలసీమ నుంచి సైతం పలువురు నేతలు పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు. బీహార్, తెలంగాణలో ఎన్నికల ఫలితాల విషయంలో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో పేదల ఇళ్ల పట్టాలకు రూ.7వేల కోట్లు ఖర్చు చేసిన ఎమ్మెల్యేలు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో 500ఎకరాలు స్థలంలో అవినీతికి పాల్పడారన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లను నాడు వాజపేయి హాయంలోనే ఏర్పాటు చేశామని, నేడు అదే సెంటర్‌ల్లో వైసీపీ ప్రభుత్వం అవినీతి చేస్తుందన్నారు.

Advertisement

Next Story