- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఫారెనర్ భారీ మోసం
దిశ, క్రైమ్ బ్యూరో: సోషల్ మీడియాలో ఫ్రెండ్‌షిప్ పేరుతో ఓ విదేశీయుడు మోసాలకు పాల్పడుతున్నాడు. అతనికి బ్యాంక్ ఖాతాల విషయంలో సహకరించిన ఇద్దరిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలిలా.. సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో ఆఫ్రికన్ పరిచయం అయ్యాడు. తాను జర్మనీ దేశానికి చెందిన డాక్టర్ అని, తన పేరు అజయ్ ఆనంద్‌గా చెప్పకుంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు. సదరు మహిళ ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించింది. అనంతరం వారిద్దరి మధ్య స్నేహపూరిత వాతావరణ ఏర్పడింది. ఆమె ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న సదరు మోసగాడు.. జర్మనీ నుంచి ఓ పార్శిల్ పంపుతున్నట్టు ఆమెకు చెప్పాడు. ఆ పార్శిల్‌లో డబ్బు, బంగారంతో పాటు బొమ్మ ఉందని నమ్మిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు పంపించాడు.
అదంతా నిజమేనని ఆ మహిళ నమ్మింది. మరుసటి రోజు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఇమ్మిగ్రేషన్ అధికారి పేరుతో ఫోన్ వచ్చింది. పార్శిల్ క్లియరెన్స్ చార్జీలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఎస్బీఐ, జీఎస్టీ, ఛారిటీ ఫండ్, యాంటీ టెర్రరిస్ట్ సర్టిఫికేట్ వంటి పలు ఛార్జీల నిమిత్తం రూ.13 లక్షలు చెల్లించాలని ఫోన్ చేసిన వ్యక్తి సూచించాడు. ఇదంతా నిజమేనని నమ్మిన ఆ మహిళ సదురు వ్యక్తి సూచించిన ఖాతాకు రూ.13 లక్షలు చెల్లించింది. అనంతరం మోసపోయినట్టు గ్రహించిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు ఆఫ్రికా దేశస్తుడికి బ్యాంక్ ఖాతాల విషయంలో సహకరించిన ఇద్దరు వ్యక్తులను (ఢిల్లీకి చెందిన) అరెస్టు చేసినట్టు డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ జాయింట్ సీపీ అవినాష్ మహాంతి తెలిపారు. అరెస్టయిన వ్యక్తులు మోసగాళ్లకు కమీషన్ పద్దతిలో బ్యాంక్ అకౌంట్‌ల విషయంలో సహకరిస్తున్నట్టు విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి వివిధ బ్యాంకులకు చెందిన 16 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.