- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఫిర్యాదు
by Shyam |

X
దిశ, దామెర: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఓ వ్యక్తి ఏకంగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశాడు. వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని సర్వే నంబర్ 93లో ఉన్న ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి ఆక్రమించారని స్థానిక వ్యక్తి బోడ రాకేశ్ నాయక్ ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల చీఫ్ సెక్రెటరీకి ఫిర్యాదు అందజేశారు. ఎమ్మెల్యే అనుచరులు, గన్‌మెన్లు, తదితరులకు సుమారు 15 పక్కా ఇండ్లు కట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపాలిటీ నుంచి ఇంటి నెంబర్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు కూడా ఇప్పించారని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ విషయంపై వరంగల్ రూరల్ ఆర్డీవో విచారిస్తున్నట్లు సమాచారం.
Next Story