ఉత్తరాంధ్రను వణికిస్తున్న భీకర గాలుల.. బాలిక దుర్మరణం

by srinivas |   ( Updated:2021-12-04 05:23:15.0  )
ఉత్తరాంధ్రను వణికిస్తున్న భీకర గాలుల.. బాలిక దుర్మరణం
X

దిశ, ఏపీ బ్యూరో: జవాద్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం మెలియాపుట్టిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈదురు గాలుల ధాటికి ఓ కొబ్బరి చెట్టు కిందపడిపోయింది. అయితే ఆ కొబ్బరి చెట్టు గోరకల ఇందు(17) అనే బాలికపై పడటంతో తీవ్రగాయాలపాలైంది.

దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆ బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాలిక మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు ఆస్పత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed