‘ఉప సర్పంచ్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’

by Shyam |   ( Updated:2021-09-25 09:23:24.0  )
‘ఉప సర్పంచ్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’
X

దిశ, పరకాల: కులం పేరుతో దూషించి చంపుతామని బెదిరించిన ఉప సర్పంచ్ క్రాంతి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి పెంబర్తి రాజు డిమాండ్ చేశారు. శనివారం పరిటాల పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజు మాట్లాడుతూ.. పరకాల మండలం లక్ష్యంపురం గ్రామ కారోబార్ అనిల్ ను ఆ గ్రామ ఉప సర్పంచ్ క్రాంతి కుమార్ గౌడ్ చంపుతామని బెదిరిస్తూ తన ఇష్టం వచ్చినట్లుగా నానా బూతులు తిట్టడాని అన్నారు.

గ్రామ పంచాయతీ సిబ్బంది అనిల్ దళితుడు అయినందునే తన జాతిని ఉద్దేశిస్తూ ఇష్టం వచ్చిన విధంగా దుర్భాషలాడిన ఉపసర్పంచ్ క్రాంతి కుమార్ గౌడ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతోపాటు తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. అనిల్ కు న్యాయం జరిగేంత వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలకు సంబంధించిన పలువురు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed