- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరో మానవ మృగానికి బలైన 12 ఏళ్ల బాలిక.. మరీ ఇంత దారుణమా ?
by srinivas |

X
దిశ వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఎన్ని దిశా చట్టాలు వచ్చినా అమ్మాయిల పై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వాలు మహిళాభివృద్ది అని పాకులాడుతున్నా అభం శుభం తెలియని చిన్నారుల పై మానవ మృగాలు జరిపే మారణకాండ ఆగడం లేదు. ఇలాంటి ఘటనే తాజాగా అనంతపురంలో జరిగింది. 12 ఏళ్ల బాలికపై కన్నేసిన కామాంధుడి దాహానికి బలైందో చిన్నారి. రమేష్ అనే 42 ఏళ్ల కామాంధుడు ఒంటరిగా వెళ్తున్న బాలిక పై కన్నేశాడు. ఆమె బహిర్భూమికి వెళుతున్న సమయంలో వెంబడించి నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం రమేశ్ అదే గ్రామంలో నాటుసారా కాచి విక్రయించే వాడని, అదే జీవనాధారంగా చేసుకున్నాడని తెలిపారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Next Story