పోలింగ్ వేళ షాకింగ్ ఇన్సిడెంట్.. ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడి ఓటు గల్లంతు

by GSrikanth |
పోలింగ్ వేళ షాకింగ్ ఇన్సిడెంట్.. ఏకంగా ముఖ్యమంత్రి సోదరుడి ఓటు గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సోదరుడు బబున్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఓటు గల్లంతైంది. ఆయనకు హౌరా ప్రాంతంలో ఓటు హక్కు ఉంది. ఐదో విడతలో భాగంగా ఆయన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని భావించారు. కానీ అతని ఓటు గల్లంతైనట్లుగా తెలిసింది. ఓటు గల్లంతుపై ఆయనను మీడియా ప్రశ్నించగా.. స్పందించేందుకు నిరాకరించారు. దీనిపై ఈసీ వివరణ ఇస్తుందని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. ప్రతి ఎన్నికల ముందు ఏదో ఒక సమస్యను సృష్టిస్తారని సీఎం మమతాబెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. తాను వారసత్వ రాజకీయాలకు అతీగం అని చెప్పారు.

Next Story

Most Viewed