కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ.. దేశంలో ఏకగ్రీవమైన తొలి లోక్‌సభ స్థానం ఇదే

by GSrikanth |
కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ.. దేశంలో ఏకగ్రీవమైన తొలి లోక్‌సభ స్థానం ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీ బోణీ కొట్టింది. సూరత్ సెగ్మెంట్ సీటుకు మొత్తం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి వేసిన నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. బీజేపీ పెద్దల రిక్వెస్ట్‌తో స్వంతత్ర్య అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ముఖేష్ ఏకగ్రీవంగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో అక్కడి బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బీజేపీ బోణీ కొట్టడం శుభపరిణామం అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గుజరాత్‌లో మొత్తం 26 పార్లమెంట్ సీట్లున్నాయి. ఈ స్థానాల నుంచి పార్లమెంటుకు ఎన్నికైన అభ్యర్థులు దేశాన్ని ప్రభావితం చేసే విధానాలను, నిర్ణయాలను, చట్టాలను రూపొందించడం, అమలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు.

Advertisement

Next Story