AP 2024 Election Results: నాడు చంద్రబాబు బీష్మ శపథం.. నేడు విజయపథం..

by Indraja |
AP 2024 Election Results: నాడు చంద్రబాబు బీష్మ శపథం.. నేడు విజయపథం..
X

దిశ వెబ్ డెస్క్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. కాగా ఆ ఎన్నికల్లో వైసీపీ 150 యొక్క స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. అయితే వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తమ వైఖరిని మార్చుకోలేదు. ప్రజా సమస్యల గురించి చర్చించాల్సిన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు చేసేవారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే వయసులోనూ రాజకీయ పరిజ్ఞానంలోనూ పెద్దవారైన చంద్రబాబు నాయుడుని అనేకసార్లు ఘోరంగా అవమానించారు. అయితే ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా విమర్శించడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులను కూడా ఘోరంగా విమర్శించారు. దీనితో భావోద్వేగానికి గురైన చంద్రబాబు నాయుడు దగ్ద హృదయంతో భీష్మ శపథం చేశారు.

తాను మళ్లీ ఎన్నికల్లో గెలిచే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని, ఒకవేళ అడుగుపెడితే అది తాను సీఎంగానే అడుగుపెడతానని భీష్మ శపథం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన శపథం ప్రకారం 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. దీనితో గత ఎన్నికల్లో 151 సీట్లను కైవసం చేసుకున్నామని గర్వపడిన వైసీపీని 13 సీట్లకు పరిమితం చేసి పాతాళానికి తొక్కారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed