- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఖమ్మం టికెట్ నాకే వస్తుందన్న నమ్మకం ఉంది: జలగం
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం లోక్‌సభ టికెట్ నాకే వస్తుందన్న నమ్మకం, విశ్వాసం తనకు ఉన్నాయని బీజేపీ నేత జలగం వెంకట్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం టికెట్‌పై పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఖమ్మం టికెట్ టీడీపీకి కేటాయిస్తారన్న అంశం నా పరిధిలోనిది కాదని చెప్పారు. పొత్తులు, సర్దుబాటులు పార్టీ పెద్దలు చూసుకుంటారని అన్నారు. ఖమ్మం అభ్యర్థి ఎవరనేది త్వరలోనే తెలుస్తుందని వెల్లడించారు.
కాగా, జలగం వెంకటరావు 2004లో కాంగ్రెస్ తరపున సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి, 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశాడు. కొంతకాలం పార్లమెంటరీ కార్యదర్శిగా కూడా ఉన్నాడు. ఇటీవల బీజేపీలో చేరారు.
కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించగా అధికార కాంగ్రెస్‌లో విపరీతమైన పోటీ నేపథ్యంలో ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. కాగా ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు ఖమ్మం ఎంపీ టిక్కెట్ కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీలోనూ టిక్కెట్ ఆశిస్తున్న వారు లేకపోలేదు. ఖమ్మంలో ప్రముఖ వైద్యుడు గోంగూర వెంకటేశ్వరరావు బీజేపీ ఖమ్మం అభ్యర్థిని తానేనని చెప్పుకుంటున్నారు. కాగా జలగం వెంకట్రావు చేరికతో జిల్లాలో పరిచయం అవసరంలేని జలగంకే అంతిమంగా టిక్కెట్ దక్కుతుందన్న చర్చ మొదలైంది.