IPL: ట్రావిస్ హెడ్ మెరుపు ఇన్నింగ్స్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ

by GSrikanth |
IPL: ట్రావిస్ హెడ్ మెరుపు ఇన్నింగ్స్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఫస్ట్ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. మెరుపు ఇన్సింగ్స్‌తో కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు భారీ స్కోరు చేసేలా కనిపిస్తోంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ స్కోర్ 6 ఓవర్లో ఒక వికెట్ కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(59), అభిషేక్ శర్మ(08) ఉన్నారు.

Advertisement

Next Story