ఈ రోజు మధ్యాహ్నం.. ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్

by Mahesh |
ఈ రోజు మధ్యాహ్నం.. ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా.. 67వ మ్యాచ్ ఢిల్లీ, చెన్నై మధ్య ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్ ఇరు జట్లకు చివరి మ్యాచ్ వావడం విశేశం. అయితే ఈ మ్యాచ్ ఢిల్లీ ఓడిపోయిన పెద్దగా ఒరిగేదేమి లేదు. ఎందుకంటే ఢిల్లీ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. కానీ చెన్నై జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ లో విజయం తప్పనిసరి ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. ప్లే ఆఫ్ రేసులో ఉంటుంది. లేకుంటే.. చెన్నై ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టంగా మారుతాయి. దీంతో ఈ మ్యాచ్ చెన్నై జట్టుకు తప్పక గెలవాల్సిన విజయం కావడం.. ఢిల్లీ ఎప్పటిలాగే చివరి మ్యాచ్‌లో విజయం సాధించి తమతో మరో జట్టును ఇంటికి తీసుకుపోవడం సెంటిమెంట్ కాబట్టి.. ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది. కాగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 కి ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ మైదానంలో జరగనుంది.

Advertisement

Next Story