- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కొత్త ట్రెండ్
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ముంబై ఇండియన్స్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా ప్రతి మ్యాచ్‌లోనూ ‘బెస్ట్ ఫీల్డర్’ అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో ముంబై జట్టు కూడా తమ ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు స్పెషల్ మెడల్‌ను ఇస్తున్నది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్‌కు ఆ మెడల్‌ను అందజేస్తారు. ఈ సీజన్‌లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై జట్టు.. ఢిల్లీపై గెలుపు ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కుగానూ ఆ జట్టు మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మకు అవార్డును అందజేశారు. హెడ్ కోచ్ మార్క్ బ్రౌచర్ రోహిత్ అవార్డు విన్నర్‌ను ప్రకటించగా.. బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డర్ రోహిత్‌కు మెడల్ అందజేశాడు.
A 𝐑𝐨 special at Wankhede. A 𝐑𝐨 special in the dressing room. 🎖️💙#MumbaiMeriJaan #MumbaiIndians #MIvDC | @ImRo45 pic.twitter.com/b555HUvVdE
— Mumbai Indians (@mipaltan) April 8, 2024
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘మన బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. దీని కోసమే మొదటి మ్యాచ్ నుంచి కష్టపడుతున్నాం. వ్యక్తిగత ప్రదర్శనలు ముఖ్యం కాదని నిరూపించాం. బ్యాటింగ్ దళం మొత్తం సమిష్టిగా నిలబడితే ఇలాంటి భారీ స్కోర్లు చేయగలం. చాలా కాలం నుంచి మనం దీని గురించే చర్చించుకుంటున్నాం. బ్యాటింగ్ కోచ్, మార్క్, కెప్టెన్ ఇలాంటి ప్రదర్శననే కోరుకుంటారు.’ అని చెప్పాడు. కాగా, ఆ మ్యాచ్‌లో రోహిత్ 27 బంతుల్లో 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై తదుపరి మ్యాచ్‌లో ఈ నెల 11న బెంగళూరుతో తలపడనుంది.