అందుకే ట్రోఫీ గెలవలేకపోతోంది.. RCB జట్టుపై సురేశ్ రైనా పరోక్ష విమర్శలు

by GSrikanth |
అందుకే ట్రోఫీ గెలవలేకపోతోంది.. RCB జట్టుపై సురేశ్ రైనా పరోక్ష విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దాదాపు పదేళ్ల పాటు టీమిండియా తరపు ఆడారు. టీమిండియా గెలిచిన అనేక మ్యాచుల్లో కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్‌లోని కొన్ని జట్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐపీఎల్ సమయంలో కొన్ని జట్లు ప్రాక్టీస్ కంటే ఎక్కువగా పార్టీలకే ప్రయారిటీ ఇస్తున్నాయని మండిపడ్డారు. అలాంటి జట్లే ఇప్పటివరకు ఒక్క ట్రోఫీని కూడా గెలవలేకపోతున్నాయని చెప్పారు. చెన్నై జట్టు ఏనాడూ పార్టీలకు ప్రయారిటీ ఇవ్వలేదని.. అందుకే ట్రోఫీలు గెలవగలిగింది అని అన్నారు. ముంబై జట్టు కూడా జల్సాలకు దూరంగా ఉంటుందని చెప్పారు. రాత్రంతా పార్టీలు చేసుకొని.. చిల్ అయ్యే ఆటగాళ్లు తర్వాతి రోజు జరిగే ఆటపై పూర్తి ఫోకస్ ఎలా పెట్టగలుగుతారని సీరియస్ అయ్యారు. అయితే, ప్రస్తుతం సురేశ్ రైనా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆర్సీబీ జట్టును ఉద్దేశించే ఈ తరహా కామెంట్లు చేశాడని కోహ్లీ ఫ్యాన్స్ రైనాపై మండిపడుతున్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story