SRH: జోరుమీదున్న ఎస్ఆర్‌‌హెఎచ్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం

by Shiva |
SRH: జోరుమీదున్న ఎస్ఆర్‌‌హెఎచ్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ మొత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
X

దిశ, వెబ్‌‌డెస్క్: జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైన శ్రీలంక ఆల్‌రౌండర్, స్పిన్ మాంత్రికుడు వనిందు హసరంగా ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. త్వరలోనే అతడు జట్టుతో చేరుతాడని అనుకున్నా.. మొత్తం టోర్నీ నుంచే వైదొలిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హసరంగా ఎడమ మడమ గాయంతో బాధపడుతున్నాడు. ఇటీవల పాడియాట్రిస్ట్‌ను కలిసిన హసరంగా.. వారి సలహా మేరకు కొంత విశ్రాంతి తీసుకోవలసి ఉండటంతో ఐపీఎల్ నుండి వైదొలిగాడు. మడమలో వాపు ఉందని, ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈవో ఆష్లే డి సిల్వా తెలిపారు. కాగా, దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.1.50 కోట్లకు రూపాయలకు వనిందు హసరంగాను కొనుగోలు చేసింది.

Advertisement

Next Story