- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ట్రోల్ చేయడం ఆపండి.. పాండ్యాకు గంగూలీ మద్దతు
by Harish |

X
దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడం ముంబైతోపాటు రోహిత్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పాండ్యాను దారుణంగా ట్రోల్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో పాండ్యాకు భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. శనివారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంగూలీ మాట్లాడుతూ.. కెప్టెన్స్ మార్పులో పాండ్యాది ఎలాంటి తప్పులేదన్నాడు. ‘అభిమానులు పాండ్యాను ట్రోల్ చేయొద్దు. అది కరెక్ట్ కాదు. రోహిత్ శర్మ వరల్డ్ క్లాస్ ప్లేయర్. కానీ, హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడం ఫ్రాంచైజీ నిర్ణయం. అందులో పాండ్యాది తప్పు లేదు.’ అని దాదా చెప్పుకొచ్చాడు. కాగా, ఆదివారం వాంఖడే స్టేడియంలో ఢిల్లీతో ముంబై తలపడనుంది.
Next Story