RCB Vs KKR: కోల్‌కతా బౌలర్లను ఉతికారేసిన విల్ జాక్స్, పటీదార్.. లక్ష్యానికి చేరువలో ఆర్సీబీ

by Shiva |
RCB Vs KKR: కోల్‌కతా బౌలర్లను ఉతికారేసిన విల్ జాక్స్, పటీదార్.. లక్ష్యానికి చేరువలో ఆర్సీబీ
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఐపీఎల్-2024‌లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 222 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ 36 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అదేవిధంగా బ్యాట్స్‌మెన్లు రింకూ సింగ్ 16 బంతుల్లో 24, ఆండ్రీ రస్సెల్ 20 బంతుల్లో 27, రమణ్‌దీప్ సింగ్ 9 బంతుల్లో 24 పరుగులు చేశారు. అనంతరం 223 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ 7 బంతుల్లో 18 పరుగులు, డూప్లెసిస్ 7 బంతుల్లో 7 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు.

విల్ జాక్స్, పటీదార్ మెరుపులు..

ఓపెనర్ల స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన విల్ జాక్స్ సిక్సులతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఏకంగా 3 సిక్సులు ఒక ఫోర్ బాదాడు. మరో మిస్టరీ బౌలర్ మిథున్ చిక్రవర్తి బౌలింగ్‌లోనూ ఫోర్, సిక్సర్ కొట్టాడు. ఇక మరో ఎండ్‌లో ఉన్న రజత్ పటీదార్ సుయాష్ శర్మ వేసిన 9 వ ఓవర్‌లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో చెలరేగాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో 2 కల్లు చెదిరే సిక్స్‌లతో కనువిందు చేశాడు. ఈ క్రమంలోనే వారిద్దరూ అండ్రీ రస్సెల్ వేసిన 11వ ఓవర్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 168 పరుగు చేసింది. సుయాష్ ప్రభుదేసాయ్ 11 బంతుల్లో 19 పరుగులు, దినేష్ కార్తీక్ 3 బంతుల్లో 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. బెంగళూరు గెలవాలంటూ మరో 30 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది.

Advertisement

Next Story