కోల్‌కతా‌కు రెండో విజయం.. బెంగళూరు చిత్తు

by Harish |
కోల్‌కతా‌కు రెండో విజయం.. బెంగళూరు చిత్తు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(83 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో చివరి వరకు అజేయంగా నిలిచాడు. గ్రీన్(33), మ్యాక్స్‌వెల్(28), కార్తిక్(20) విలువైన పరుగులు జోడించారు. అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 16.5 ఓవర్లలోనే ఛేదించింది. 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(50) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సునీల్ నరైన్(47) తృటిలో అర్ధ శతకం చేజార్చుకోగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(39 నాటౌట్), ఫిలిప్ సాల్ట్(30) సత్తాచాటారు. కోల్‌కతా బ్యాటర్లు చెలరేగడంతో బెంగళూరు చిత్తుగా ఓడింది.

Advertisement

Next Story