సోమనాథ్ ఆయలంలో ముంబై కెప్టెన్ హార్దిక్ ప్రత్యేక పూజ

by GSrikanth |
సోమనాథ్ ఆయలంలో ముంబై కెప్టెన్ హార్దిక్ ప్రత్యేక పూజ
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస ఓటములతో ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో సతమతమవుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు బలంగా ఉన్నా.. రాణించలేకపోతోంది. ఈ క్రమంలోనే ఆ జట్టు సారథి హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్సీ మార్పు కారణంగా జట్టుకు ఈ పరిస్థితి తలెత్తిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ఆలయంలో ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. శుక్రవారం గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని హార్దిక్ సందర్శించారు. శివుడికి పాలాభిషేకం చేసి మొక్కులు చెల్లించారు. వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. కాగా, ఈ నెల 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ నాలుగో మ్యాచ్ ఆడనుంది. ఇందులో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని జట్టు మొత్తం ఉవ్విళ్లూరుతోంది.

Advertisement

Next Story