ఆస్ట్రేలియాకు మిచెల్ మార్ష్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ

by Harish |
ఆస్ట్రేలియాకు మిచెల్ మార్ష్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురుదెబ్బ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ మార్ష్ గాయానికి చికిత్స కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. అతను ఈ నెల 3న కోల్‌కతాతో చివరి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను కుడి కాలు తొండ కండరాల గాయంతో ఇబ్బందిపడినట్టు తెలుస్తోంది. దీంతో ముంబై, లక్నో మ్యాచ్‌లకు మార్ష్ దూరమయ్యాడు. అయితే, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే అతను చికిత్స నిమిత్తం ఆస్ట్రేలియాకు పయనమైనట్టు తెలుస్తోంది. దీంతో మిగతా సీజన్‌కు అతను అందుబాటులో ఉండటంపై అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై ఢిల్లీ మేనేజ్‌మెంట్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరోవైపు, లక్నోతో మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌ వేలికి గాయమైంది. తదుపరి మ్యాచ్‌లో అతను ఆడటంపై సందేహాలు ఉన్నాయి. కాగా, ఈ సీజన్‌లో తడబడుతున్న ఢిల్లీ జట్టుకు గాయాలు మరింత సమస్యగా మారాయి. ఆ జట్టు ఈ నెల 17న గుజరాత్‌తో తలపడనుంది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story