- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉత్కంఠ పోరులో ఒక్క పరుగుతో లక్నో విజయం
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా జరిగిన 68వ మ్యాచ్ కోల్ కతా, లక్నో జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్ వరకు గెలుపు నీదా నాదా అన్నట్లు రింకు సింగ్ మ్యాచ్ ను తీసుకొచ్చాడు. కానీ చివరికి విజయం లక్నో జట్టునే వరించింది. ఈ మ్యాచ్ మొదట్లో టాస్ గెలిచిన KKR బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన LSG జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి.. 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన కోల్ కతా జట్టుకు మంచి ఆరంభమే లభించినప్పటికీ.. మిడిల్ ఓవర్లలో గౌతమ్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా పటిష్టంగా బౌలింగ్ చేశారు.
దీంతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ KKR చేతిలోంచి లక్నో చేతిలోకి వెళ్ళిపోయింది. కానీ చివర్లో రింకు సింగ్ మరోసారి లక్నో బౌలర్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం 33 బంతుల్లో 67 కొట్టిన రింకూ.. ఒకానొక సమయంలో కేకేఆర్ కు విజయం అందించే ప్రయత్నం చేశాడు. కానీ చివరి ఓవర్ వేసిన యస్ ఠాకూర్.. పటిష్టమైన బంతులు వేయడంతో లక్నో జట్టు 1 పరుగుల తేడాతో విజయం సాధించి.. ప్లే ఆఫ్ చేరుకుంది.