- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేకేఆర్‌తో పోరులో కొత్త జెర్సీలో లక్నో ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో భాగంగా ఆదివారం కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు కొత్త జర్సీ ధరించనున్నారు. ఇప్పటివరకు బ్లూ జెర్సీలో కనిపించిన లక్నో ప్లేయర్లు కేకేఆర్‌పై మెరూన్, గ్రీన్ కలర్స్‌తో ఉన్న జెర్సీలో కనిపించనున్నారు. ఈ మ్యాచ్ కోసం లక్నో స్పెషల్ జెర్సీ ధరించడం వెనుక కారణముంది. భారత ఫుట్‌బాల్ క్లబ్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్ కూడా లక్నో యాజమాన్యం ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూపునకు చెందినదే. ఆ క్లబ్ జెర్సీ మెరూన్, గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్‌ను కలిగి ఉన్న మోహన్ బగాన్ క్లబ్ స్ఫూర్తితో లక్నో ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో ఆ జెర్సీని ధరించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. అయితే, ఫుట్‌బాల్ క్లబ్ జెర్సీని ధరించడం ఇదే తొలిసారి. గత సీజన్‌లోనూ కేకేఆర్‌తో మ్యాచ్‌లో లక్నో మెరూన్, గ్రీన్ జెర్సీతో ఆడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో లక్నో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.