ఐపీఎల్ 2023లో అత్యల్ప టోటల్‌ను కాపాడుకున్న LSG

by Mahesh |
ఐపీఎల్ 2023లో అత్యల్ప టోటల్‌ను కాపాడుకున్న LSG
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఈ సీజన్‌లోనే అత్యల్ప టోటల్ స్కోరుతో విజయం సాధించింది. జైపూర్ వేదికగా RR, LSG మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన లక్నో బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 154 పరుగుల చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు ఈజీగా గెలవాల్సిన మ్యాచును చేజేతులారా ఓడిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. దీంతో లక్నో జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించి టేబుల్ టాపర్‌గా నిలించింది.

Advertisement

Next Story