- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు మూటగట్టుకున్న హైదరాబాద్
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రికార్డు స్కోరుతో సంచలనం సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ చరిత్రలోనే చెత్త రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్ ఫైనల్‌లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. చెపాక్ స్టేడియంలో కోల్‌కతాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్‌లో ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు ఫైనల్‌లో లోయెస్ట్ స్కోరు చేసిన జట్టుగా చెన్నయ్ ఉండేది. 2013 సీజన్ ఫైనల్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ 125/9 స్కోరు చేసింది. అలాగే, హైదరాబాద్‌కు ఇది రెండో లోయెస్ట్ స్కోరు. 2019లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 96 పరుగులకే ఆలౌటైంది. 2015లో ముంబైపై 113 పరుగులకే కుప్పకూలింది.
Advertisement
Next Story