బుమ్రా బౌలింగ్‌లో ఆ షాట్ కొట్టాలనుకున్నా.. కొట్టేశా : అశుతోష్ శర్మ

by Dishanational3 |
బుమ్రా బౌలింగ్‌లో ఆ షాట్ కొట్టాలనుకున్నా.. కొట్టేశా : అశుతోష్ శర్మ
X

దిశ, స్పోర్ట్స్ : బుమ్రా బౌలింగ్‌‌లో ఆడిన స్వీప్ సిక్స్ నా డ్రీమ్ షాట్ అని పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ తెలిపాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 9 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. పంజాబ్‌ను గెలిపించడానికి అశుతోష్ శర్మ అద్భుతమైన పోరాటం చేసిన ఫలించలేదు. 28 బంతుల్లో 7 సిక్స్‌లు, 2 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. బుమ్రా వేసిన 13వ ఓవర్‌లో అశుతోష్ కొట్టిన స్వీప్ సిక్స్ కచ్చితంగా చూసితీరాల్చిందే.

మ్యాచ్ అనంతరం అశుతోష్ శర్మ ఈ సిక్స్ గురించి స్పెషల్‌గా మాట్లాడాడు. ‘బుమ్రా బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడాలనేది నా కల. నెట్స్‌లో స్వీప్ షాట్లను ప్రాక్టీస్ చేశా. చివరికి ఆ కల నెరవేరింది. క్రికెట్‌లో ఇలాంటివి సహజమే. అయితే, మేము మా ఆటతీరుపై ఫోకస్ పెడతాం. ‘నువ్వు నియంత్రణ లేకుండా షాట్లు ఆడే వాడివి కాదు.సరైన క్రికెట్ షాట్లు ఆడతావు. కాబట్టి, వాటిని మెరుగుపర్చుకో.’ అని సంజయ్ బంగర్ చెప్పాడు. అది చిన్న స్టేట్‌మెంటే. కానీ, నా ఆత్మవిశ్వాసాన్ని పెంచి నా ఆటలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని నేను ఫాలో అవడానికి ప్రయత్నిస్తున్నా.’ అని తెలిపాడు. కాగా, ఈ సీజన్‌లో అశుతోష్ శర్మ సత్తాచాటుతున్నాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 52 సగటుతో 156 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 205.26 ఉండటం గమనార్హం.

Next Story

Most Viewed