- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు కరోనా
న్యూఢిల్లీ : ఐపీఎల్-16 సీజన్‌లో కరోనా వైరస్ ప్రవేశించింది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ ఆకాశ్ చోప్రా వైరస్ బారిన పడ్డాడు. తాజా పరీక్షల్లో అతనికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మంగళవారం ఆకాశ్ చోప్రానే స్వయంగా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘కరోనా వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. కానీ, ఆరోగ్యంగానే ఉన్నాను. కొద్ది రోజులపాటు కామెంటరీకి దూరంగా ఉంటాను. త్వరలోనే తిరిగి వస్తానని ఆశిస్తున్నాను’ అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
కాగా, డిజిటల్ బ్రాడ్‌కాస్టర్ కామెంటరీ ప్యానెల్‌లో ఆకాశ్ చోప్రా భాగంగా ఉన్నాడు. కాగా, ఐపీఎల్-16లోనూ బీసీసీఐ కరోనా నిబంధనలను అమలుచేస్తున్నది. ఎవరైనా వైరస్ పాజిటివ్‌గా తేలితే వారం రోజులపాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. నెగెటివ్‌గా తేలిన తర్వాతే మిగిలిన ప్లేయర్లతో కలిసేందుకు, మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతి ఇస్తారు.