15 నెలల తర్వాత తొలి మ్యాచ్ ఆడటంపై పంత్ ఫీలింగ్ ఇదే

by Harish |
15 నెలల తర్వాత తొలి మ్యాచ్ ఆడటంపై పంత్ ఫీలింగ్ ఇదే
X

దిశ, స్పోర్ట్స్ : రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత టీమ్ ఇండియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రీఎంట్రీకి సిద్ధమయ్యాడు. శనివారం పంజాబ్ కింగ్స్‌పై తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు పంత్ మాట్లాడుతూ.. టెన్షన్‌గా, ఆందోళనగా, ఉత్సాహంగా ఉందన్నాడు. ‘అదే సమయంలో తిరిగి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నందుకు ఆనందంగా ఉంది. నా తొలి మ్యాచ్‌ ఆడేందుకు ఎదురుచూస్తున్నా. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి భిన్న అనుభూతిని పొందుతాను.’ అని చెప్పాడు. తాను చేయాల్సిందంతా బ్యాటుతోనే చేస్తానని, ప్రతి మ్యాచ్‌లోనూ 100 శాతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. కాగా, ఐపీఎల్-2022లో మే 21న ముంబై ఇండియన్స్‌పై పంత్ చివరి మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్ దాదాపు 15 నెలలు ఆటకు దూరమయ్యాడు.

Advertisement

Next Story