బ్రూక్ స్థానంలో ఢిల్లీ జట్టులోకి సౌతాఫ్రికా పేస్ సంచలనం

by Harish |
బ్రూక్ స్థానంలో ఢిల్లీ జట్టులోకి సౌతాఫ్రికా పేస్ సంచలనం
X

దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్, ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్-17కు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ ఫ్రాంచైజీ అతని స్థానాన్ని భర్తీ చేసింది. బ్రూక్ స్థానంలో సౌతాఫ్రికా పేసర్ లిజాద్ విలియమ్స్‌ను తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు సోమవారం వెల్లడించారు. రూ. 50 లక్షల కనీస ధరతో విలియమ్స్ ఢిల్లీ జట్టులో చేరాడు. 2021లో దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విలియమ్స్ రెండు టెస్టులు, 4 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. మొత్తంగా 24 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో పాల్గొనడం అతనికి ఇదే తొలిసారి. మరోవైపు, ఢిల్లీ జట్టు సోమవారం ముంబై చేతిలో ఓటమితో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచింది. ఈ నెల 12న లక్నోతో తలపడనుంది.

Advertisement

Next Story