శ్రేయస్ అయ్యర్‌కు రూ. 12 లక్షలు జరిమానా.. ఎందుకంటే?

by Dishanational3 |
శ్రేయస్ అయ్యర్‌కు రూ. 12 లక్షలు జరిమానా.. ఎందుకంటే?
X

దిశ, స్పోర్ట్స్ : రాజస్థాన్ చేతిలో అనూహ్య ఓటమిని చవిచూసిన కోల్‌కతా నైట్ రైడర్స్‌(కేకేఆర్)కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో కోల్‌కతా తమ బౌలింగ్ కోటాను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించిన కారణంగా ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్‌కు ఫైన్ వేసినట్టు ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం వెల్లడించారు. తొలి తప్పిదం కావడంతో రూ. 12 లక్షలు జరిమానా విధించినట్టుగా పేర్కొన్నారు.

ఈ సీజన్‌లో అయ్యర్ కంటే ముందు గిల్, పంత్, శాంసన్ స్లో ఓవర్ రేట్ ఉల్లంఘించి జరిమానా ఎదుర్కొన్నారు. కాగా, రాజస్థాన్ చేతిలో 2 వికెట్ల తేడాతో కోల్‌కతా ఓడిపోయింది. ఒక దశలో కేకేఆర్ విజయం సునాయాసమే అనిపించినా.. జోస్ బట్లర్ వీరోచిత పోరాటంతో ఓటమి తప్పలేదు. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా 4 విజయాలు, 2 ఓటములతో రెండో స్థానంలో కొనసాగుతుంది. తదుపరి మ్యాచ్‌లో ఈ నెల 21న బెంగళూరుతో తలపడనుంది.

Next Story

Most Viewed