ముంబై ఊపిరి పీల్చుకో.. సూర్య వచ్చేస్తున్నాడు

by Harish |
ముంబై ఊపిరి పీల్చుకో.. సూర్య వచ్చేస్తున్నాడు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌‌కు గుడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ప్లేయర్, నం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ టీమ్‌లో చేరబోతున్నాడు. మోకాలి సర్జరీ అనంతరం ఫిట్‌నెస్ సాధించకపోవడంతో గత మూడు మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు.

తాజాగా సూర్య నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ టెస్టులను క్లియర్ చేశాడు. ఐపీఎల్‌లో పాల్గొనేందుకు అతనికి ఎన్‌సీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నేడో, రేపో అతను ముంబై జట్టులో చేరనున్నాడు. ముంబై జట్టు ఈ నెల 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు సూర్య అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనలో సూర్య మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. గాయానికి సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఎన్‌సీఏలో పూర్తిగా కోలుకున్నప్పటికీ ఫిట్‌నెస్ టెస్టులను క్లియర్ చేయకపోవడంతో అతని ఐపీఎల్‌ ఎంట్రీ ఆలస్యమైంది. ఈ సీజన్‌లో గెలుపు ఖాతా తెరవని ఏకైక జట్టు ముంబైనే. హ్యాట్రిక్ ఓటములతో ఆ జట్టు పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఒంటిచెత్తో మ్యాచ్‌లను గెలిపించే సూర్య రాకతో ముంబై జట్టులో కొత్త జోష్ రానుంది.

Advertisement

Next Story