IPL 2023: కోహ్లీ ఔట్‌పై అప్ఘాన్ ప్లేయర్ ఎగతాళి పోస్ట్!

by Vinod kumar |
IPL 2023: కోహ్లీ ఔట్‌పై అప్ఘాన్ ప్లేయర్ ఎగతాళి పోస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో ఆర్సీబీ, లక్నో మ్యాచ్ సందర్భంగా తలెత్తిన వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కన్పించడం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు నవీన్ ఉల్ హక్, మెంటార్ గంభీర్ మధ్య తలెత్తిన గొడవ గురించి తెలిసిందే. ఈ ఘటనను విరాట్ కోహ్లీ మర్చిపోయినా.. అఫ్గాన్ ప్లేయర్, లక్నో జట్టుకు ఆడుతున్న నవీన్ ఉల్ హక్ మాత్రం వదిలేలా కన్పించడం లేదు. తాజాగా నవీన్ ఉల్ హక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

మంగళవారం వాంఖడే స్టేడియంలో ముంబై-ఆర్సీబీ జట్లు తలపడ్డగా.. ఈ మ్యాచ్‌లో 4 బంతులను ఎదుర్కొన్న విరాట్ కోహ్లి ఒక పరుగు మాత్రమే చేసి క్యాచ్ ఔటయ్యాడు. ఈ సమయంలో నవీన్ ఉల్ హక్ సోషల్ మీడియాలో విరాట్‌ను ఉద్దేశించి పరోక్షంగా పోస్టు పెట్టాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను స్టోరీగా పెట్టాడు. ముంబయి, బెంగళూరు మ్యాచును తాను టీవీలో చూస్తున్న దృశ్యాన్ని ఇన్‌స్టాలో పెట్టిన నవీన్ ఉల్ హక్.. "స్వీట్ మ్యాంగోస్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ముంబయి ఇండియన్స్ మ్యాచు గెలుపుకు చేరువైన సమయంలోనూ మరో పోస్టు చేశాడు. రౌండ్ నెంబర్ 2 అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. నవీన్ ఉల్ హక్ ఈ పోస్టుల ద్వారా ఆర్సీబీకి, కోహ్లికి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది.

Advertisement

Next Story